దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే…
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ గోవాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. తాజాగా ఊహించని పరిణామామే చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ సీఎం ప్రతాప్ సింహ రాణే.. పోటీ నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం పోరియం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రతాప్ సింహ రాణేను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ.. కానీ, తాజాగా ఆయన…
గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 40 శాసన సభ స్థానాలకు గాను గురువారం 34 అభ్యర్థుల పేర్లు వెల్లడించింది . ఐతే, ఎప్పటి లాగే ఇది కొందరికి రుచించలేదు. దాంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. సిట్టింగ్ మినిస్టర్ తో పాటు మాజీ సిఎం కుమారుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం భార్య…
అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోవాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గోవా ప్రజల గుండెల్లో మంచి సీఎంగా పేరు పొందిన మనోహర్ పారికర్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది.. అది ఆయనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం.. అయతే, తాను ఆశించిన అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.…
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆమ్ అద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్‌లో గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించిన ఆప్ ఎలాగైనా పంజాబ్ అసెంబ్లీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నది. ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా, ఇప్పుడు గోవా పై దృష్టి సారించింది ఆ పార్టీ. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిగా…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికేయూ) నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్ మేళాకు వచ్చిన తికాయిత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. Read Also: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ-రాష్ట్రీయ…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు…
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జగరబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్రకటించింది. జనవరి 14 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 14 వరకు ఎలాంటి పాదయాత్రలు, ర్యాలీలు చేసేందుకు వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అదే…
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. జనవరి 14 వ తేదీన యూపీలో తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఈసీ తెలిపింది. తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14,23,27, మార్చి 3,7 వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14 వ…