ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది.…