EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు.