భూతాపం వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది.
భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.