ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి…