మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చారు పలువురు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామని.. అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి వృధా ఖర్చు చేస్తాం. దాన్ని…
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న…