సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు.…
దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవి కన్నా పీసీసీని బాధ్యతగా స్వీకరిస్తాను అన్నారు.. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్తాను.. ఈ దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం తామేనని స్పష్టం చేశారు.. త్వరలోనే బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర పర్యటన చేస్తామని ప్రకటించారు. ఇక, అగ్ర వర్ణాలవారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ హర్షకుమార్ అసంతృప్తి…