Minister Anam: దేవాలయాలలో నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేశారు. దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులు చేశారు
అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యి ధర విషయంలో ఆరా తీస్తోంది ప్రభుత్వం.. ఏలూరు జిల్లా లక్కవరంలోని రైతు డైరీ నుంచి కిలో నెయ్యి 538.60 రూపాయలకు కొనుగోలు చేస్తోంది దేవస్థానం.. అయితే, అదే నెయ్యి విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి కిలో 385.41 రూపాయలకు చొప్పున విక్రయిస్తోంది రైతు డైరీ.. రెండు ఆలయాలకు ఇచ్చే ధరల్లో 153 రూపాయల వ్యత్యాసం ఉంది.. ఒకే క్వాలిటీ, ఒకే కంపెనీ... రెండు దేవాలయాల్లో ఎందుకు అంత తేడాతో టెండర్లు…