Geoffrey Boycott Health Update: ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గొంతు క్యాన్సర్ చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికెళ్లిన ఆయన ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరారు. 83 ఏళ్ల బాయ్‌కాట్ ప్రస్తుతం నిమోనియాతో బాధపడుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన కుమార్తె ఎమ్మా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా నాన్న జెఫ్రీ బాయ్‌కాట్ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరికీ…