Gautham Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే వన్డే ప్రపంచకప్‌కు ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎందుకంటే ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడమే ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు భారత్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని సూచనలు చేశాడు. అవసరమైతే వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా ఆటగాళ్లను పక్కనపెట్టాలని సూచించాడు. ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో…
Gautham Gambhir: టీమిండియా వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న వేళ టీమ్ కాంబినేషన్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ రాణించిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఇంతకంటే ఇషాన్ కిషన్ సత్తాకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించాడు. దీంతో ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సెలక్టర్లు…
Gautham Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ ఎప్పుడు చూసినా విరాట్ కోహ్లీ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా అతడు మరోసారి కోహ్లీపై తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీని చూసి సహించలేక తన నోటికి పనిచెప్పాడు. విరాట్ కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు.…
Telugu Desam Party MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్ హాలు సందడిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభకు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే…
టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దొరకడమే ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్ల లిస్టులో రోహిత్, కేఎల్ రాహుల్, ధావన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులు అందుబాటులో ఉండటంతో మయాంక్‌కు చోటు దక్కడం కష్టతరంగా ఉంది. అయితే టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరంగా ఉండటంతో శ్రీలంకతో తొలి టెస్టుకు మయాంక్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అతడు కేవలం 33 పరుగులకే వెనుతిరిగాడు.…
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బుధవారం రోజు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ రాగా.. గురువారం కూడా ఓ ఈమెయిల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా వచ్చిన బెదిరింపులో ‘నిన్ను చంపాలనుకుంటున్నాం… నిన్న బతికిపోయావ్.. బతుకు మీద ఆశ ఉంటే రాజకీయాలను, కాశ్మీర్ అంశాన్ని వదిలేయ్’ అంటూ ఈ మెయిల్‌లో ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Read Also: వైద్యం ఖర్చు రూ.వెయ్యి…