Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్‌మోర్, మనోహర్ యాదవ్‌లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.