Gauri Lankesh murder: గౌరీ లంకేష్ హత్యా నిందితులకు హిందూ అనుకూల సంఘాల నుంచి ఘనస్వాగతం..
- గౌరీ లంకేష్ హత్య నిందితులకు ఘన స్వాగతం..
- హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో సన్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్‌మోర్, మనోహర్ యాదవ్‌లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.
కర్ణాటకలోని విజయపురలోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారికి హిందూ అనుకూల మద్దతుదారులు పూలమాలలు వేసి, కాషాయ శాలువాలతో సత్కరించారు. నినాదాలతో స్వాగతం పలికారు. వారిద్దరిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. అనంతరం కాళికా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుల మద్దతుదారులు మాట్లాడుతూ.. వారిని తప్పుగా జైలులో పెట్టారని పేర్కొన్నారు.
Also Read
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
Read Also: Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్‌కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..
వాఘ్‌మోర్, యాదవ్‌లతో పాటు అమోల్ కాలే, రాజేష్ డి బంగేరా, వాసుదేశ్ సూర్యవంశీ, రుషీకేష్ దేవదేకర్, గణేష్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డీలకు అక్టోబర్ 09న బెయిల్ మంజూరైంది. ప్రోహిందూ లీడర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విజయదశమి, మాకు ముఖ్యమైన రోజు. గౌరీ లంకేష్ హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఆరేళ్లుగా అన్యాయంగా జైలులో ఉన్న పరశురామ్ వాఘ్మోర్, మనోహర్ యాదవ్‌లను మేము స్వాగతిస్తున్నాము. అసలు నేరస్థులు ఇంకా కనుగొనబడలేదు, కానీ ఈ వ్యక్తులు కేవలం హిందూ అనుకూలులుగా ఉన్నందుకు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అన్యాయానికి తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరం.’’ అని అన్నారు.
వామపక్ష భావాలు ఉన్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్, హిందుత్వ భావజాలానికి బద్ధవ్యతిరేకిగా ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 05, 2017న బెంగళూర్‌లో ఆమె ఇంటి వెలుపల ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 2023లో గౌరీలంకేష్ హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!