నటి, నిర్మాత జీవిత రాజశేఖర్- గరుడ వేగా సినిమా నిర్మాతల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.నిన్నటికి నిన్న జీవితా.. ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్ లో గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నా కూతురు లేచిపోయింది కొందరు, మేము మోసం చేశామని మరికొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి.. మా…