వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మంగళగిరికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి.. 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన చిరంజీవి.. ఇవాళ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.. మరికొందరు ముఖ్యనేతలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా.. సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి గంజి…
తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఆయన.. గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.. ఇక, లోకేష్ మంగళగిరిపై కేంద్రీకరించి పనిచేయడంతో.. తనకు ఆ స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. కానీ, ఏ పార్టీలో చేరతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు.. కానీ,…
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు గంజి చిరంజీవి.. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.