AP DGP: ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం!
- గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం
- సీసీ కెమెరాలు ఏర్పాటుపై దృష్టి
- చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి.. ఐజీ అధికారిని నియమించామన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా.. మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం అని డీజీపీ చెప్పారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి.. కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనకాపల్లిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ… ‘ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే లక్ష్యం. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు పెంచాం. ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్స్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉంది. గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం. గంజాయి మహమ్మారికి బానిసలుగా మారోద్దని యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సంకల్ప రథాలు ద్వారా ప్రచారం చేస్తున్నాం’ అని చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని భావిస్తున్నాం. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించాం. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా.. ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల హాట్ స్పాట్లను గుర్తించాం. రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. పోలీసులు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేయాలి. రాష్ట్ర మొత్తంగా క్రైమ్ రేట్ తగ్గడం అభినందించదగ్గ విషయం’ అని డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!