Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేసారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని అన్నారు. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని ఎద్దేవ చేశారు. పవన్ కల్యాణ్, కేఏ.పాల్ కూడా వచ్చారని మండిపడ్డారు. తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటరై పాత బిడ్డల్లారా రండి అంటున్నాడని ఆరోపించారు. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలు అంటూ మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అంటూ నిప్పులు చెరిగారు.
Read also: MLC Kavitha: సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమే
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
మళ్లీ 1956 నవంబర్ 1 గుర్తుకు తెస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని? అంటూ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదని గుర్తు చేశారు. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరి వెనక బీజేపీ ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్ర సంపదపై కన్నేసి వస్తున్నారని ఆరోపించారు. హైద్రాబాద్ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగమే ఇదంతా అన్నారు. బీఆర్ఎస్ తో మేము దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారు? అని ప్రశ్నించారు.
మీది జాతీయ పార్టీనే కదా కర్ణాటకలోకో, తమిళనాడులోకో చంద్రబాబు ఎందుకు పోవడం లేదు? అంటూ ప్రశ్నించారు. మనం ఏనాడు ఏపీ సంపద దోచుకోవాలనుకోలేదు. అందుకే ఏపీలో పక్కా పోటీ చేస్తాం అన్నారు. వాళ్లు గతంలో తెలంగాణను దోచుకున్నవాళ్లు, దోచుకోవాలనుకుంటున్న వాళ్లు కాబట్టే వ్యతిరేకిస్తున్నామన్నారు. తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు కూడా మిమ్మల్ని నమ్మరని తెలిపారు. మద్రాసు నుంచి తన్ని తరిమేస్తే సంపద ఎక్కువగా ఉన్న తెలంగాణను ఆనాడు కలిపారన్నారు. ఇప్పుడు మళ్లీ వేర్వేరు వేషాల్లో గద్దల్లా తెలంగాణ సంపదను దోచుకునేందుకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ సత్ఫాలన చూసి దేశమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆరోపించారు. మాకు దేశంలోని నలు మూలల నుంచి వందల ఫోన్లు వస్తున్నాయని, ఏపీలో కూడా మాకు అద్భుత మెజార్టీ వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
Harish Rao: “తెలంగాణ” నోట్లో “మట్టి కొట్టి”న వ్యక్తి “చంద్ర బాబు”
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు