భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ…