బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా…