టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. రోహిత్-కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు అని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలనే అభిప్రాయంను తాను ఏకీభవించను…