Ukku Satyagraham : గద్దర్ నటించిన చివరి చిత్రం ఈనెల 29న రిలీజ్ ఫిక్స్
- గద్దర్ చివరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం
- రిలీజ్ డేట్ ప్రకటించిన గద్దర్ కూతురు
- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 29న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
మాజీ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ “ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పిరింగ్ గా ఉంది. గద్దర్ గారు కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయం. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. అయన స్వయంగా నటించిన సినిమా ఇది. అయన స్ఫూర్తి ని ఈ సినిమా లో నింపారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, అందరూ సినిమాని ఆదరిస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమా లో నటించిన అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డి గారికి కూడా నా అభినందనలు.” అని తెలిపారు.
Also Read
Also Read : Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ, “ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల తేదీ ని అనౌన్స్ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని కోసం ఈ సినిమా చేసారు గద్దర్ గారు. ఆయన ఈ సినిమా లో నటించినట్టు లేదు, జీవించినట్టు ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!