P. Kodandaram: గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రెడ్డి సంఘం భవనంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని అన్నారు. తొమ్మిది సంవత్సారాల నుండి తెలంగాణ పాలన పై తప్పులను ఎత్తి చూపుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు. మాకు( తెలంగాణ ఉద్యమకారులకు ) పదవులు, కీర్తి, కిరీటాలు కాదు తెలంగాణ అభివృద్ధి మాత్రమే అన్నారు. తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొట్లాట, తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం అనేది ప్రొఫెసర్ జయశంకర్ ఆశయమన్నారు. తప్పులను ఎత్తి చూపినందుకే ఈ ప్రభుత్వం మా పై దాడులకు పాల్పడింది, చాలా కేసులు పెట్టిందన్నారు. రామగుండం ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతం అని జయశంకర్ ఉన్న సమయంలోనే కేసీఆర్ తో సహా నిపుణులు ఖరారు చేశారని తెలిపారు. ఓసిపి గనులు వద్దు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలనేది మా ప్రపోజల్ అని అన్నారు.
Read also: Independent Candidate: స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య.. వారి వేధింపులే కారణమా..?
కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడి అభివృద్ధిని మర్చిపోయి, ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారని అన్నారు. స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడుతున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఒక్కో నియోజకవర్గానికి ఏటా 50కోట్లు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడే వాడితే స్థానికులకు అత్యున్నతమైన విద్య అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆఖరికి బూడిద కూడా ఇక్కడి ఎమ్మెల్యేకి ఒక “వరదాయిని” లా మారిందన్నారు. ఇక్కడి నాయకులకు లాభాలు కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం మిగిలింది బూడిద మాత్రమే అన్నారు. ఆఖరికి ఆర్.ఎఫ్.సి.ఎల్ కూడా స్థానిక ఎమ్మెల్యే కి లాభం చేకూరేలా మారిందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితులపై చేసిన విధానానికి ఎమ్మెల్యే పై కేసు పెట్టాలన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ కి ముఖ్య కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, హైదరాబాద్ లో సిఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందన్నారు.
Miss Universe 2023: ‘మిస్ యూనివర్స్’గా షెన్నిస్ పలాసియోస్!