G20: జీ20లో చేరేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత పర్యటనకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా బాదం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.
PM Modi: తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు ఆయన యూరప్‌లో ఉంటారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యూరప్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.
జీ-20 విందులో రాష్ట్రపతిని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని రాయకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.
Xi Jinping: సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్ ఇండియాకు రావడం లేదు. అతని స్థానంలో ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు.
G20 Summit: సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలకు విందు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ ఆహ్వానమే వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా రాష్ట్రపతి ఆహ్వానంలో ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ అని ఉంటుంది. అయితే ఈ ఆహ్వానంలో మాత్రం ‘‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’గా ఉంది. ఇప్పుడు ఇదే కొత్త రచ్చకు కారణమవుతోంది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి జీ20 దేశాధినేతలను విందుకు…
Carona: అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్‌కు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని సోమవారం వైట్ హౌస్ తెలిపింది. అయితే అధ్యక్షుడు జో బిడెన్ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది.
ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరుస్తుందని, విశ్వాస సందేశాన్ని పంపుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు.