అప్పు పుట్టేదెలా? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. కొంతకాలంగా ఏదోరకంగా రుణం తేవడం.. బండి నడిపించడం ఆర్థికశాఖ అధికారులకు అలవాటైంది. ఇప్పుడు కేంద్రం పరిమితులు విధించింది. భారీగా కోత పెట్టింది. మరి.. ఇప్పుడెలా? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ ఆర్థిక సంవత్సరం రూ.42,472 కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయం! ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా.. సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా వెనకాడకుండా గట్టిగానే ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అప్పుల కోసం…
ఓవైపు కరానో విలయం సృష్టించింది.. మహమ్మారి, లాక్‌డౌన్ దెబ్బతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికపోయాయి.. చిన్న చిన్న సంస్థ మూతబడ్డాయి.. పెద్ద సంస్థలు కూడా భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి.. క్రమంగా ఆ భారం ఉద్యోగాలు, ఉపాధిపై కూడా పడింది.. అయితే, ఇదే సమయంలో.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరిగిపోయిందనే వార్తలు వచ్చాయి.. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020…
ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి రానున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు విడుదల కాగా, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఐతే తాజాగా రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని…