Beer: బీరు సీసాలను మద్యంప్రియులు సరదాగా బీరకాయలు అని పిలుచుకుంటారు. బీరు.. ప్రపంచంలోనే అతిపురాతన ఆల్కహాల్ డ్రింక్. అన్ని పానీయాలతో పోల్చితే.. ఇది.. నీరు, తేనీరుల తర్వాత.. 3వ స్థానంలో నిలుస్తుంది. యంత్రాలతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే బీరును క్రాఫ్ట్ బీర్ అంటుంటారు. మన దేశంలోని చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్‌లలో ‘Bira-91’ కూడా ఒకటి.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ మరియు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరోసారి నిధుల సమీకరణ కోసం తెర తీస్తోంది. నూతన సంవత్సరంలో కొత్త ఫండింగ్ రౌండ్‌లో 750 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయనుంది. దీంతో స్పేస్‌ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 137 బిలియన్ డాలర్లకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ 2022లో 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను పోగేసిన సంగతి తెలిసిందే.