Elon Musk: ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ మరియు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరోసారి నిధుల సమీకరణ కోసం తెర తీస్తోంది. నూతన సంవత్సరంలో కొత్త ఫండింగ్ రౌండ్‌లో 750 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయనుంది. దీంతో స్పేస్‌ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 137 బిలియన్ డాలర్లకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ 2022లో 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను పోగేసిన సంగతి తెలిసిందే.
మే నెలలో 127 మిలియన్ డాలర్లు మరియు జులైలో 250 మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ సంస్థ స్టార్‌లింక్‌లో 2022లో 10 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు చేశారు. దీనికితోడు.. స్పేస్‌ఎక్స్ ఒక్క ఏడాదిలోనే 60కిపైగా పునర్వినియోగ రాకెట్ ప్రయోగాలను నిర్వహించటం విశేషం. ఈ కంపెనీ.. మరో వైపు.. స్టార్‌షిప్ అనే ప్రాజెక్టు అభివృద్ధిని కొనసాగిస్తోంది. ఇది ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్టనే సంగతి తెలిసిందే.
read more: Bengaluru and Hyderabad: నాణేనికి ఒక వైపు మెరుపు. మరో వైపు.. మరక
ఇలాంటి ప్రాజెక్టును ఇప్పటివరకూ ఏ గవర్నమెంట్ కంపెనీ గానీ ప్రైవేట్ రాకెట్ డెవలప్‌మెంట్ సంస్థ గానీ చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. స్పేఎస్‌ఎక్స్ సైతం ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేయటం ఇదే మొదటిసారి. మనుషులను తొలిసారిగా అంగారక గ్రహం పైకి తీసుకెళ్లేందుకు ఎలాన్ మస్క్ ఈ స్టార్‌షిప్‌కి శ్రీకారం చుట్టారు. కాకపోతే.. ఆయన ఈమధ్య ఎక్కువ దృష్టిని ట్విట్టర్ కొనుగోలు మరియు నిర్వహణ పైనే పెట్టడంతో ఆ ప్రభావం స్పేస్‌ఎక్స్ పనితీరు మీద పడిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.