గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…