ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి.