అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది.