iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
China Iphone : కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోమారు కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. చైనాలో ప్రస్తుతం రోజుకు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.