China Iphone : ఐఫోన్ కంపెనీలో ఆందోళన.. పొట్టపొట్టుగా కొట్టుకున్నరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Iphone : కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోమారు కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. చైనాలో ప్రస్తుతం రోజుకు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ను నిర్మూలించేందుకు చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా లాక్ డౌన్ అమలు చేస్తుంది. అయితే తన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చైనా ఫ్యాక్టరీల్లో తయారీకి అనుమతి ఇచ్చింది. కంపెనీల్లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అనుమానితులను అందులో ఉంచుతున్నారు. కొన్ని నెలలుగా కార్మికులంతా ఫ్యాక్టరీల్లోనే మగ్గుతున్నాయి. సిబ్బంది బయటికి వెళ్లకుండా కొన్ని చోట్ల ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్.. నెలలో 13 మంది మృతి
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
ఫలితంగా సిబ్బంది.. కార్మికులు నెలల తరబడి క్వారంట్లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో యాపిల్ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫ్యాక్స్ కాన్ ప్లాంట్లో పని చేసే సిబ్బంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీలో ఘర్షణలు తలెత్తాయి. సెక్యూరిటీ సిబ్బంది కార్మికులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఆ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కొవిడ్‌తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్‌లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
河南富士康全民抗暴政,喊殺震天警車砸爛 中共大白防疫兵被打的抱頭鼠竄,替全國老百姓出了一口惡氣,真痛快。 pic.twitter.com/RmvMSdwQKu
— 界立建 (@jielijian) November 23, 2022
Les policiers chinois prennent la fuite ce soir face aux ouvriers de l'usine d'iPhone de Zhengzhou #Chine #China pic.twitter.com/comGMvr36p
— Anonyme Citoyen (@AnonymeCitoyen) November 23, 2022
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?