BLN Reddy: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి. ఈడీ ముందు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో HMDA చీఫ్ ఇంజనీర్‌గా పదేళ్ల పాటు పని చేసిన ఆయన, ఈ కేసులో A3గా ఉన్నారు. ఈ రేస్ కేసులో ముఖ్యాంశంగా నిధుల బదిలీపై ఈడీ దృష్టి సారించింది. HMDA నుంచి నిధులు ఎలా..? ఎందుకు..? బదిలీ అయ్యాయి అనే విషయంలో బీఎల్‌ఎన్…
KTR Quash Petition: ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ మంగళవారానికి (31)కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారించింది.
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఏసీ మీటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు.
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు.
తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.