స్టైలిష్ లుక్‌తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్‌లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి.
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది.