జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ భౌతికకాయానికి బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంపై సోరెన్ ఎక్కి ఎక్కి ఏడ్చారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు.