Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion in Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. గతంలో సీజ్ చేసి స్టేషన్‌లో నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రిని కోర్టుకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక కారు కూడా ఈ ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఈ దుర్ఘటనలో చల్లపల్లి ఎస్సై దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాతో పాటు మరో సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కానిస్టేబుల్ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే మంగళగిరిలోని ఎన్నారై (NRI) ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే వారిని విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ కు చేరుకుని నమూనాలను సేకరించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ బృందం విచారణ చేపట్టింది. సీజ్ చేసిన పేలుడు పదార్థాలను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించారా లేదా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె కృష్ణా జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన పోలీసులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని, ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆమె కోరారు. ప్రస్తుతం చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!