AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో ఛార్జిషీట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ పాత్రకు సంబంధించిన పలు కీలక అంశాలను సిట్ వివరించింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం, వివిధ డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన వ్యవహారంలో ప్రణయ్ ప్రకాశ్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో అతను పలువురు వ్యక్తులతో కలిసి వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపింది.
అలాగే చెవిరెడ్డితో కలిసి విదేశీ పర్యటనలు చేసినట్లు, రాజ్ కేసిరెడ్డితో కలిసి విలాసవంతమైన జీవనం గడిపినట్లు సిట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. చార్టర్ విమానాల్లో ప్రయాణాలు చేయడంతో పాటు ఖరీదైన హోటళ్లలో బస చేసిన వివరాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం ఏమిటంటే, మద్యం అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన నగదును రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు అపార్ట్మెంట్లలో దాచిపెట్టినట్లు సిట్ ఆరోపించింది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని నగదు కట్టలను భద్రపరిచినట్లు ఛార్జిషీట్లో వివరించింది.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా వెలికితీసినట్లు సిట్ వెల్లడించింది. సేకరించిన ఆధారాలు, ఫొటోలు, డిజిటల్ డేటా ఆధారంగా సమగ్ర ఛార్జిషీట్‌ను సిద్ధం చేసి ఏసీబీ కోర్టులో సమర్పించినట్లు తెలిపింది. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, సిట్ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావచ్చనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?