కృష్ణ సోదరి లక్ష్మీ తులసి, నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మనవడు ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక కార్యక్రమం మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ ఎన్ సీసీ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కె. రాఘవేంద్రరావు, మోహన్ బాబు, కృష్ణంరాజు సతీమణి శ్యామల, ప్రముఖ దర్శకులు పి. సాంబశివరావు, సాగర్, ప్రముఖ నిర్మాతలు సి. అశ్వనీదత్, జి .ఆదిశేషగిరిరావు, కె.యస్. రామారావు, కె.యల్..నారాయణ, యస్..గోపాలరెడ్డి, యన్. రామలింగేశ్వరరావు, పద్మాలయ…
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని అప్పటి ప్రభుత్వం, సినిమా పెద్దలు భావించారు. అందుకు విశాఖ పట్టణాన్ని కేంద్రంగానూ ఎంచుకున్నారు. అప్పటికే అక్కడ డి.రామానాయుడు ఫిలిమ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఓ ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్ అవసరమని భావించారు. విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అక్కడి ఔత్సాహికులను ప్రోత్సహించడానికి స్థాపించడం జరిగింది. ఆ క్లబ్ కు అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నియమితులయ్యారు.…