FNCC Elections Results: హైదరాబాదులోని ఫిలింనగర్ కల్‌చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. నిన్నటి ఎన్నికల్లో అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో బరిలోకి దిగిన కృష్ణ సోదరుడు అభ్యర్థి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మరోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓటమి చెందారు.. బండ్లగణేష్ పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. నిన్న ఆదివారం ఉదయం హోరాహోరీగా ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రానికి పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి గెలిచిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
అయితే.. రెండేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఎఫ్ఎన్‌సీసీలో మొత్తం 4,600 మంది సభ్యులు కాగా, అందులో 1,900 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. నిన్నటి ఎన్నికల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారు. ముళ్ళపూడి మోహన్ సెక్రటరీగా, తుమ్మల రంగారావు వైస్ ప్రెసిడెంట్ గా, రాజశేఖర్ రెడ్డి ట్రెజరర్ గా వీవీఎస్ఎస్ పెద్దిరాజు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇదే కమిటీలో కమిటీ మెంబర్స్ గా ఏడిద రాజా, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, Ch. వరప్రసాదరావు, శైలజ జూజాల, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్రావు, బాలరాజు, గోపాలరావు వంటి వారు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
LIVE : సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?