Influenza: భారతదేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. రెండు ఏళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతన్న ఫ్లూతో భయపడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా-ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967…