గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ విమానం దగ్గర్లోని బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలోని 241 ప్రయాణికులే కాకుండా.. హాస్టల్‌లో ఉన్న 24 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. 2016 నుంచి 2021వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా సేవలందించిన విషయం తెలిసిందే. 242 మందితో ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం చాలా దారుణంగా మారింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగింది? టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.