TDS New Rules: ఏప్రిల్ 1, 2025 నుండి టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) నిబంధనల్లో పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. యూనియన్ బడ్జెట్-2025లో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయంపై TDS భారం తగ్గనుంది.