TDS New Rules: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు బిగ్ రిలీఫ్.. ఏప్రిల్ 1 నుండి కొత్త TDS రూల్స్
- ఏప్రిల్ 1 నుండి కొత్త TDS రూల్స్
- ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు బిగ్ రిలీఫ్.
- కొత్త నిబంధనలతో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయంపై తగ్గనున్న TDS భారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDS New Rules: ఏప్రిల్ 1, 2025 నుండి టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) నిబంధనల్లో పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. యూనియన్ బడ్జెట్-2025లో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయంపై TDS భారం తగ్గనుంది. మరి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందామా.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వడ్డీ ఆదాయంపై TDS పరిమితిని రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1 నుండి, సీనియర్ సిటిజన్ల మొత్తం వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్షలను మించితేనే బ్యాంకులు TDSని డిడక్ట్ చేస్తాయి. అంటే, ఈ పరిమితిలోపు వడ్డీ ఆదాయం ఉంటే TDS కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ నియమం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), రికరింగ్ డిపాజిట్లు (RDలు) ఇతర సేవింగ్స్ విధానాల నుండి వచ్చే వడ్డీకి వర్తిస్తుంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Read Also: Hospital Fraud: వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు
ఇక సాధారణ పౌరులకు కూడా TDS పరిమితిలో మార్పు జరిగింది. ఇప్పటివరకు రూ. 40,000గా ఉన్న వడ్డీ ఆదాయం పరిమితిని రూ. 50,000కి పెంచారు. ఒకవేళ మీ వడ్డీ ఆదాయం రూ. 50,000లోపు ఉంటే, బ్యాంకు TDSని డిడక్ట్ చేయదు. ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై ఆధారపడే వారి పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక లాటరీ సంబంధిత TDS నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. గతంలో ఒక సంవత్సరంలో గెలిచిన మొత్తం రూ. 10,000 మించితే TDS డిడక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు, ఒక్కో లావాదేవీ రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటేనే TDS కట్టబడుతుంది. దీనివల్ల చిన్న మొత్తాలు గెలిచిన వారికి ఊరట కలుగుతుంది.
ఇన్సూరెన్స్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరర్లకు కూడా TDS పరిమితి పెంచడం ద్వారా ప్రయోజనం కల్పించారు. ఇన్సూరెన్స్ కమీషన్‌పై TDS లిమిట్ రూ. 15,000 నుండి రూ. 20,000కి పెరిగింది. ఈ మార్పు వారి ఆదాయంపై పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్లలో పెట్టుబడి పెట్టే వారికి కూడా శుభవార్త. డివిడెండ్ ఆదాయంపై TDS పరిమితి రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచబడింది. దీనివల్ల ఈ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయంపై TDS భారం తగ్గుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!