వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి.. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయి.. అధికారంలోఉన్న రాష్ట్రాల్లో పవర్ కోల్పోవడమే కాదు.. మిగతా రాష్ట్రాల్లో కూడా ఘోర పరాజయం తప్పలేదు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది.. ఈ భేటీకి జీ-23 అసమ్మతి నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు,…
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నింపాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు పడడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో చూపిన వివరాల ప్రకారం.. యూపీ ఎన్నికల్లో నోటా 0.69 శాతం ఓట్లను పొందడం గమనించాల్సిన అంశం. 100 సీట్లలో పోటీచేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం 0.47 శాతం ఓట్లు మాత్రమే పొందిందని ఈసీ తెలిపింది. ఆప్ 0.35…
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.. ఇక, ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పిన ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు..…