Big Explosion : టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్‌లోని రెస్టారెంట్‌లో ఆదివారం జరిగిన ట్యాంక్ పేలుడులో ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
కేరళలో దారుణం జరిగింది. కన్నూర్‌లోని పున్నచ్చేరిలో అర్ధరాత్రి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.. దీంతో ఆ కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన ప్రదేశంలోనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.