Miryalguda Accident: మిర్యాలగూడ రోడ్డు ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miryalguda Accident: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంచలనంగా మారింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో కారును ఢీ కొట్టిన లారీని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ లో సిసి పుటేజ్ ఆధారంగా లారీని అద్దంకి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కెట్పల్లికి చెందిన పొట్టు లారీగా గుర్తించారు. కారును ఢీకొట్టిన అతను భాయందోళనకు గురయ్యాడని. అక్కడి నుంచి ఎవరూ గుర్తించకుండా లారీని స్పీడ్ గా నడుపుతూ పరారయ్యాడని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల్లోనే నిందితున్ని పట్టుకున్నారు.
Read also: Facebook Fraud: ఆన్‌లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
మిర్యాలగూడలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటికి చేరుకునేలోపే మృత్యువు లారీ రూపంలో కబలించింది. రెండు కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్ (32), అతని భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), అతని కుమారుడు లియాన్సి (2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహేష్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రధాన రహదారిపై కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు