అంతర్వేదిలో మత్స్యకారులకు అప్పుడప్పుడూ పంట పండుతుంటుంది. సాగరమాత వారికి ఇలా వరాలు ఇస్తూ వుంటుంది. వారి వలలో పడే చేపలు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. వారి కుటుంబానికి ఆధరువు అవుతాయి. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ట గోదావరి నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.…
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు…
సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే జాలర్లకు ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. చాలా కాలంగా పశ్చిమ బెంగాల్‌లోని దిఘా జాలర్లు సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని వేటను కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే 10 మంది జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అనూహ్యంగా వారి వలకు అరుదైన జాతికి చెందిన 33 తెలియా భోలా చేపలు చిక్కాయి. ఈ…
చేపల ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రోగాల నుంచి చేపలు ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని చేపలు రుచితో పాటుగా ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. సాధారణంగా టూనా చేపల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ టూనా చేపల్లో కూడా బ్లూఫిన్ టూనా ఖరీదు మరింత అధికం అంటున్నారు. ఈ రకం చేపలను అంతరించిపోయే జాతి చేపలుగా గుర్తించడంతో ధరలు అధికంగా ఉంటాయి. చాలా అదురుగా మాత్రమే ఇవి కనిపిస్తుంటాయి. కొన్ని దేశాల్లో ఈ…
సిద్దిపేట జిల్లా : కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడుదల చేసి… రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు ,తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని… సీఎం కేసిఆర్ ప్రత్యేక…
ప్రపంచంలో ఎక్కువమంది సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సముద్రంలో దొరికే చేపలను పట్టుకొని జీవిస్తుంటారు. అయితే, ప్రతిరోజూ సముద్రంలో అద్భుతాలు జరుగుతాయని అనుకోకూడదు. ఒక్కోసారి అదృష్టం అలా కలిసి వస్తుంది. నిత్యం సముద్రంలో చేపలు పట్టుకొని జీవించే ఓ మత్స్యకారుడి వలకు ఓ పెద్ద చేప దొరికింది. ఆ చేపను పడవలోని బల్లపై ఉంచి కత్తిలో కోశాడు. చేప కడుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండగా అతడికి ఓ బాటిల్ దొరికింది. దాన్ని చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు.…
అధృష్టం ఎవర్ని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. కష్టం ఎప్పుడూ ఊరికేపోదు. నిత్యం కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఎదో ఒకరూపంలో అదృష్టం ఎప్పుడోకప్పుడు వరిస్తుంది. పాకిస్తాన్ కు చెందిన సాజిద్ హాజీ, అబు బకర్ అనే వ్యక్తులు సముద్రంలో చేపల వేటతో జీవనం గడుపుతుంటారు. చాలా కాలంగా చేపల వేటతో జీవనం సాగిస్తున్న వీరికి కడలి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అరుదైన, విలువైన చేప వీరి వలకు చిక్కింది. అట్లాంటిక్ క్రోకర్ అరుదైన, విలువైన చేప. ఆసియా, యూరప్…