ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. విద్యార్థి దివ్యాంగుడని పేర్కొన్నారు.