Indian Economy: ఆర్థికవృద్ధిలో ఇండియా దూసుకుపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం చివరిదైన జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతం వృద్ధిరేటు నమోదైంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మొదటి త్రైమాసికంలో లాభాలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో లాభాలు రావడంతో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త తెలిపింది.