TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మొదటి త్రైమాసికంలో లాభాలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో లాభాలు రావడంతో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు 15 శాతం వరకూ వేతనాల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. టీసీఎస్ ఆర్డర్ బుక్ జోరుగా ఉందని… ప్రస్తుతం 10.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఉన్నాయని నూతనంగా నియమితులైన సీఈవో, ఎండీ కృతివాసన్ వెల్లడించారు. కొత్తగా ఆవిర్భవించిన టెక్నాలజీల ఫలితంగా తమ సర్వీసులకు దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందన్న విశ్వాసాన్ని సీఈవో వ్యక్తం చేశారు. భౌగోళిక ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా ఆదాయ వృద్ధి 4.6 శాతానికి తగ్గింది. దేశీయ ఐటీ రంగానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రాంతం ఉత్తర అమెరికా, బీమా రంగం బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఇన్సూరెన్స్) కాగా అమెరికాలో చిన్న బ్యాంక్‌ల సంక్షోభంతో టీసీఎస్ ప్రభావితమైనట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యూకే ఆదాయం అత్యధికంగా 16.1 శాతం వృద్ధి చెందింది. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగం ఆదాయం 10.1 శాతం పెరగ్గా, బీఎఫ్‌ఎస్‌ఐ ఆదాయం 3 శాతమే అధికమయ్యింది.
Read also: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్!
జూన్ త్రైమాసికంలో టీసీఎస్ నికరంగా 523 మంది ఉద్యోగుల్ని కొత్తగా చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,15,318కు పెరిగినట్టు హ్యుమన్ రిసోర్సెస్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. వలసల రేటు క్యూ1లో మరింత తగ్గి.. 17.8 శాతానికి దిగింది. మొత్తం ఉద్యోగుల్లో 35.8 శాతం మంది మహిళలు ఉన్నారని, 154 దేశాలవారు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,534 కోట్ల నికర లాభాన్ని గడించింది హెచ్‌సీఎల్ టెక్నాలజీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,324 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన లాభంతో పోలిస్తే 11 శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 26,296 కోట్లు ఆర్జించింది. గత త్రైమాసికంలో సంస్థ 18 అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నది. వీటిలో ఏడు సేవల రంగానికి సంబంధించినవి కాగా.. మిగతా 11 సాఫ్ట్‌వేర్ విభాగానివి.
Read also: Nani 30: నీ చూపులోనే మాయ ఉంది బాసూ… నిన్ను మించిన నేచురల్ నటుడు లేడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వేతనాల పెంపును వాయిదా వేసినట్టు వార్తలు వెలువడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి జీతాలను పెంచినట్టు టీసీఎస్ ప్రకటించింది. మంచి పనితీరు కనపర్చిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం మేర వేతనాలు పెంచామని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ శేక్సారియా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే తమ ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 23.1 శాతం నుంచి 23.2 శాతానికి పెరిగిందని.. ఉద్యోగుల వార్షిక వేతనం పెంపుతో లాభాల మార్జిన్‌లో 2 శాతం దెబ్బతగిలినప్పటికీ, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడం ద్వారా ఆ లోటును పూడ్చుకున్నామని శేక్సారియా తెలిపారు.