2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన రెండు పోస్టర్స్ ను అక్షయ్ కుమార్ శనివారం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు… ఉజ్జయినిలో పంకజ్ త్రిపాఠీతో పాటు ఉన్న ఓ చిన్న పాటి వీడియోనూ విడుదల చేశారు. ‘మీ శుభాకాంక్షలు, అభినందనలు ‘ఓఎంజీ -2’కు కావాలి. ప్రధానమైన సామాజికాంశం నేపథ్యంలో ఈ సినిమాను నిజాయితీతో తీయబోతున్నాం. ఈ ప్రయాణంలో ఆదియోగి ఆశీస్సులు మాకు ఉంటాయని…