Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్‌తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును…